Telugu

‘చైతూ – సమంత’ల పెళ్ళికి అడ్డు ఎవరు?

ఇట్స్… అఫిషియల్… అంతా బయటకు వచ్చేసింది. నాగచైతన్య – సమంతల ప్రేమకధను నాగార్జున అధికారికంగా బయటపెట్టేసారు. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి బయట తిరిగిన విషయం మీకు తెలిసిందేనని, వారిద్దరూ హ్యాపీగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలన్న వారి నిర్ణయానికి నేను కూడా హ్యాపీ అంటూ నాగ్, తన చైతూ పెళ్లి సమంతతోనే అన్న విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ సందర్భంలో అఖిల్ నిశ్చయ తాంబూలాల ముహూర్తాన్ని ఖరారు చేసిన నాగ్, చైతూ విషయం మాత్రం బయటపెట్టలేదు.

దీంతో చైతూ వివాహం మరింత ఆలస్యం కావచ్చు అన్న టాక్ ఊపందుకుంది. వివాహం తర్వాత సమంత సినిమాలలో నటించడం ఆపేస్తుందన్న సమాచారం ఓ పక్కన ఉండగా, తాజాగా సమంత మరికొన్ని మంచి చిత్రాలలో నటించాలని ఉందంటూ ట్వీట్ చేయడం విశేషం. ఈ ఏడాది నాలుగు చిత్రాల ద్వారా మంచి విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ… మరిన్ని చిత్రాలు లైన్ లో ఉన్నాయన్న సమాచారాన్ని అందించింది.

ADVERTISEMENT

ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోయినా… ఇటీవలే ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ సినిమా పూర్తయిన తర్వాత పెళ్లి ఉంటుందా? లేక పెళ్లి చేసుకున్నా గానీ, సినిమాలలో కొనసాగడం సమంత అభిమతమా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చైతూ వివాహం ఎప్పుడు జరుగుతుందనేది సమంత చేతుల్లో ఉన్నట్లుగా కనపడుతోంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Pics: Nabha Natesh Turns Traditional Glam Into Bold Mood

Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…

14 minutes ago

200-Episode BIG Gamble: Is YouTube Replacing Indian TV?

Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…

45 minutes ago