
బహుశా ఈ టోటల్ ఎపిసోడ్ ని సమంత బాగా ఎంజాయ్ చేస్తుందేమో గానీ, జరిగిన పరిణామాలపై కింగ్ నాగార్జున మాత్రం కాస్త సీరియస్ అయినట్లుగా లేటెస్ట్ టాక్. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్వయంగా సమంత ఇచ్చిన సిగ్నల్స్ పై నాగ్ ఓ చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లుగా తాజాగా జరుగుతున్న ప్రచారం. వ్యక్తిగత విషయాలకు సంబంధించి… అందులోనూ వివాహ సంబంధిత అంశాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి సంచలన ప్రకటనలు చేయవద్దని సూచనలతో కూడిన క్లాస్ తీసుకున్నట్లుగా భారీ స్థాయిలో సోషల్ అండ్ వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీనికి మరింత బలాన్ని ఇచ్చే విధంగా సమంత సైలెన్స్ చెప్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత చివరగా ఈ నెల 24వ తేదీన చివరి ట్వీట్ ని చేసింది. అయితే ఆ ట్వీట్ చేసిన సమయంలో సమంత యూరోప్ లో తన సహచర హీరోయిన్లతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బహుశా ఆ వెకేషన్ లో ఉండడం వలనే శ్యామ్ సైలెన్స్ గా ఉందన్న వాదన కూడా హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా సమంత సోషల్ మీడియా వ్యవహారం అటు అక్కినేని ఇంట, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయినట్లుగా కనపడుతోంది.
అంతేకదా… ప్రతిష్టాత్మకమైన అక్కినేని ఇంటికి కాబోయే కోడలు, ‘అండర్ వేర్’ గురించి పబ్లిక్ గా మాట్లాడితే ఎవరికి మాత్రం అభ్యంతరాలు లేకుండా ఉంటాయి… అంటూ అక్కినేని అభిమానులు ఈ ‘క్లాస్’ వార్తలను సమర్ధిస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో సమంత ‘సైలెన్స్’ ఎప్పటికి బ్రేక్ అవుతుందో..!?
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…
Directed by Venu Gopal Reddy, Romanchakam features Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead…