
సరిలేరు నీకెవ్వరూ 1.78 మిలియన్ డాలర్లకు చేరగా, అల వైకుంఠపురంలో 1.75 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఒకరోజు ఆలస్యంగా విడుదలైన అల వైకుంఠపురంలో దాదాపుగా సరిలేరు నీకెవ్వరూ దరిచేరడం విశేషం. ఈ శనివారానికి అల వైకుంఠపురంలో రెండు మిలియన్ల మార్కు చేరుతుందని సమాచారం.
ఇది బన్నీ కేరీర్ లో మొట్టమొదటి 2 మిలియన్ డాలర్ సినిమా. సరిలేరు నీకెవ్వరూ కూడా చేరుతుంది గానీ మరికొంత టైం పట్టే అవకాశం ఉంది. క్లాస్ సినిమా, త్రివిక్రమ్ బ్రాండ్, బెటర్ రివ్యూలు అల వైకుంఠపురంలో కి బాగా కలిసొచ్చాయి. గత కొంత కాలంగా అమెరికా ట్రేడ్ వరుస పరాజయాలతో సతమతం అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ ఎఫెక్ట్ కూడా గట్టిగా పడింది. హిట్టయిన సినిమాలు కూడా అందుకు తగినట్టుగా వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. దీనితో ఈ రెండు సినిమాలు మెరుగ్గా రాణించడంతో ట్రేడ్ ఊపిరి పీల్చుకుంది. ఈ ట్రెండ్ సంవత్సరమంతా సాగాలని ట్రేడ్ కోరుకుంటుంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు…
Prabhas is undoubtedly one of the biggest superstars in Indian cinema. Since the release of…