
అప్పుడు ఒకరి మీద ఒకరు తొడగొట్టుకోవడం అనవసరం. మొన్న ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు టీం ఒక టీజర్ రిలీజ్ కు టైం చెప్పగా అల వైకుంఠపురములో తమ పాట టీజర్ టైం ని సాంకేతిక కారణాలు అంటూ కావాలనే వాయిదా వేసుకుని పోటీకి దిగారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీం తమ సినిమాలోని మొదటి పాట సాయంత్రం 5.04 నిముషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.
ఇప్పుడు అదే టైం కి సమజవరాగమనా సాంగ్ 100 మిలియన్ వ్యూస్ కు చిత్ర బృందం థాంక్స్ చెప్పే వీడియోని విడుదల చేస్తున్నాం అని ప్రకటించింది చిత్రబృందం. సరిలేరు పాటకు రావాల్సినంత మైలేజ్ రాకుండా చెయ్యడమే దీని వ్యూహమని మహేష్ బాబు ఫాన్స్ ఆరోపణ. ఏది ఏమైనా ఈ విషయంలో అల వైకుంఠపురములో బృందం వ్యవహార శైలి సరిగ్గా లేదనే చెప్పాలి.
అల వైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్, సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు గతంలో బన్నీకి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి హాట్ట్రిక్ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు.
After making his directorial debut with Oke Oka Jeevitham, Shree Karthick is preparing for his…
The Rajinikanth - Kamal Haasan multistarrer directed by Nelson is back in the news. This…