Telugu

సచిన్ రికార్డు బద్దలు… కోహ్లి మళ్ళీ కొట్టాలి..!

క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ రమేష్ టెండూల్కర్ పేరిట నమోదైన రికార్డులను బద్దలు కొట్టడం దాదాపుగా దుస్సాధ్యమేనన్న వాదనలు క్రమంగా పటాపంచలవుతున్నాయి. రెండున్నర దశాబ్దాల పాటు టీమిండియా జట్టులో కొనసాగిన టెండూల్కర్ లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. అయితే అతడి పేరిట నమోదైన రికార్డులను బద్దలు కొట్టడం తమకు సాధ్యమేనని కుర్రకారు క్రికెటర్లు రుజువు చేస్తున్నారు.

బ్యాటును ఝుళిపించడంలో సత్తా ఉన్న క్రికెటర్ గా పేరున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మన్, టెస్టు జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్… సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. పిన్న వయసులో టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా సచిన్ పేరిట ఉన్న రికార్డును కుక్ చెరిపేసి తన పేరిట లిఖించుకున్నాడు. దుర్హామ్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో 47 పరుగులు చేసిన కుక్… 31 ఏళ్ల 158 రోజుల వయసులో పది వేల పరుగుల మార్కును చేరుకున్నాడు.

ADVERTISEMENT

2005లో 31 ఏళ్ల 326 రోజుల వయసులో ఉండగా కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఈ మార్కును చేరుకున్నాడు. తాజాగా అతడి కంటే చిన్న వయసులోనే కుక్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 158 టెస్టుల్లోనే కుక్ ఈ మార్కును చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో పది వేల పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లలో కుక్ 12వ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మరి ఈ రికార్డును బద్దలు కొట్టడం భారత క్రికెటర్ విరాట్ కోహ్లి వల్లే అవుతుందని భారత క్రీడాభిమానులు భావిస్తున్నారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

6 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

6 hours ago