
ఈ నెలాఖరున చిత్ర బృందం ఒక కీలక షెడ్యూల్ కోసం పూణే వెళ్తుంది. ఆ షెడ్యూల్ లో ఆలియా జాయిన్ అవుతుందట. మనకు ఉన్న సమాచారం ప్రకారం చిత్రంలో ఆమెది చాలా చిన్న పాత్రట. పూణే షెడ్యూల్ లోనే ఆమె పార్టు మొత్తం పూర్తి అయిపోతుందని సమాచారం. జూన్ చివరికల్లా ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని జక్కన్న టార్గెట్ గా పెట్టుకున్నాడట.
వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య. రాజమౌళి నుండి బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది. మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా కోసం కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…