
రాబోయే రెండు నెలల్లో ఈ నటికి బాలీవుడ్లో వేరే కమిట్మెంట్స్ లేవు. కానీ ఆమె డిసెంబర్ లేదా జనవరి 2021 నుండి తన ఇతర బాలీవుడ్ సినిమాల షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని వారికి స్పష్టం చేసింది. కాబట్టి, ఆర్ఆర్ఆర్ బృందం అలియా యొక్క భాగాలను మరియు రామ్ చరణ్ మరియు ఆమె పాటలను మొదట పూర్తి చేస్తుంది.
ప్రస్తుత ఉన్న పరిస్థితుల బట్టి ఈ చిత్రం 2021 రెండవ భాగంలో విడుదల అవుతుంది. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం.
రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ టీజర్ కూడా విడుదల కావాల్సి ఉన్నా, లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. అలియా భట్ షూటింగ్ కు ముందు ప్రిఫెరెన్స్ ఇస్తే… ఎన్టీఆర్ టీజర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…