
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర కోసం ఇప్పుడు నరేష్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇంకా నరేష్ కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా క్యారెక్టర్ పాత్రలతో కేరీర్ బండి ముందుకు నడపవచ్చు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం.
పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్య, సునీల్, రామ్కీ తదితరులు నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డిస్కోరాజా సినిమా ప్రస్తుతం రవితేజకు ఎంతో కీలకం. ఆయన గత మూడు చిత్రాలు టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటొని ఘోరంగా విఫలమయ్యాయి. ఆయన పుంజుకోవాలంటే డిస్కోరాజా హిట్టు కావడం చాలా అవసరం.
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…