
ఒకసారి సాధారణ స్థితి పునరుద్ధరించబడిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. సమ్మర్ 2021 లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్రణాళిక. అయితే మహేష్ బాబు – పరశురామ్ చిత్రం మరియు ఎన్టిఆర్ – త్రివిక్రమ్ చిత్రం కూడా సమ్మర్ రిలీజ్ పై దృష్టి సారించినందున, అల్లు అర్జున్ రెగ్యులర్ షూట్ ప్రారంభించిన అదే రోజున తన సినిమా విడుదల తేదీని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు.
ఏప్రిల్ 28/29, 2021 పరిశీలనలో ఉన్న తేదీలు. అయితే ప్రభాస్ బాహుబలి 2 2017 ఏప్రిల్ 28 న విడుదలై ట్రెండ్‌సెట్టర్‌గా మారింది. దానితో ఆ తేదీ వైపే బన్నీ మొగ్గు చూపుతున్నాడని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తుంది. రష్మిక సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాల సక్సెస్ తో మంచి జోరు మీద ఉంది. ఈ సినిమా గనుక హిట్ అయితే ఆమెకు తిరుగుండదు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడు. ఈ చిత్రం మొదట సుకుమార్ మహేష్ బాబుతో చెయ్యాలని అనుకున్నాడు. సినిమా అధికారికంగా ప్రకటించిన తరువాత మహేష్ బాబు తప్పుకున్నాడు. ఇప్పుడు అదే స్క్రిప్ట్ తో బన్నీని హీరోగా చేస్తున్నాడు సుకుమార్.
The upcoming film Summer Holidays is produced by Dheeraj Mogilineni under the Dheeraj Mogilineni Entertainments…
India started the five match T20I series against New Zealand with a four wicket win…