
దాదాపుగా తొమ్మిది నెలల పాటు షూటింగ్ మొదలుపెట్టలేని పరిస్థితి. ఎలాగోలా గత నెలలో షూటింగ్ మొదలు పెట్టారు. అయితే మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే మళ్ళీ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న డజన్ మందికి కరోనా సోకిందంట. ఒకతని పరిస్థితి సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి కూడా.
అయితే అతనికి కరోనా లేదని ఆ టీం అంటుంది. పుష్ప షూట్ దాదాపుగా 800 మందిని లొకేషన్ లో ఉంచి కొనసాగించారట. సామజిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం కుదరకపోవడంతో… కరోనా ప్రబలడానికి కారణం అయ్యి ఇప్పుడు షూటింగ్ ఆపెయ్యాల్సిన పరిస్థితి. తిరిగి ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి.
ఎప్పుడు తిరిగి మొదలవుతుంది అనేదాని బట్టే వేసవికి వస్తుందా రాదా అనేది చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ పరిణామాలపై అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. అల వైకుంఠపురంలో భారీ విజయంతో అల్లు అర్జున్ కు దిష్టి తగిలిందని. అందువల్లే పుష్ప కు ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని వారు అనడం విశేషం.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…