Telugu

టాక్సిక్ పోతే.. రాకాపై ఎందుకీ పంచాయితీ?

టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే ఫలితం వస్తుందంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ రెండింటికీ పోలికేంటి అన్నదానికి మాత్రం సమాధానం లేదు.

దర్శకుడు, నటీనటులు, కథ.. ఏ విషయంలోనూ టాక్సిక్, రాకా మధ్య సంబంధం లేదు. అలాంటప్పుడు యష్ సినిమాకు వచ్చిన ఫలితమే అల్లు అర్జున్ సినిమాకూ వస్తుందని ఇప్పుడే ఎలా తేల్చేస్తారు?

ADVERTISEMENT

అసలు రాకా నుంచి ఇప్పటివరకు వచ్చింది పోస్టర్ మాత్రమే. సినిమా ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఇంకేమీ బయటకు రాలేదు. అయినా అప్పుడే ఫలితం చెప్పేస్తున్నారంటే, అది సినిమాపై అంచనా కంటే అల్లు అర్జున్ ఓడిపోవాలనే కోరికలాగే కనిపిస్తోంది.

అల్లు అర్జున్ విషయంలో ఇలాంటివి కొత్తేమీ కాదు. కారణాలేవైనా, ఆయన సినిమా ఫెయిల్ కావాలని కోరుకునే వాళ్లు ఉన్నారు. ఇప్పుడు టాక్సిక్ ఫలితాన్ని కూడా అందుకు వాడుకుంటున్నారు. ఆయనపై కోపమో, ఎదుగుదలపై అసూయో తప్ప ఈ పోలికకు మరో కారణం కనిపించడం లేదు.

టాక్సిక్‌తో పోలుస్తూ రాకాపై వస్తున్న సోషల్ మొయిద పోస్టులు, ట్వీట్ల సంఖ్య చూస్తే, సినిమా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కంటే అది పోవాలనే ఆశ ఎంతుందో అర్థమవుతోంది. యాంటీ ఫ్యాన్స్ నుంచి నెగెటివిటీ మొదలయ్యేది ఇలాగే.

సినిమా నుంచి ఏదైనా చూశాక అభిప్రాయం చెప్పొచ్చు. పోస్టర్ మాత్రమే చూసి ఫెయిల్యూర్ కోరుకుంటే.. సమస్య సినిమాతో కాదు, అల్లు అర్జున్‌తోనే అనుకోవాలి.

Share
Chaitanya Krishna

I’m passionate about Telugu cinema, but I also enjoy watching films in other languages, especially Malayalam and Tamil. I love offering critical yet meaningful analysis of movies.

Published by

Recent Posts

Prahaar Review: Controversial Subject, Weak Screenplay

After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…

17 minutes ago

Jailer 2 BO 2nd Day: Rajinikanth’s 1000 Crore Dream ON?

Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…

8 hours ago