
అల్లు అర్జున్, రానాల మధ్య కూర్చుకున్న ‘కుందనపు బొమ్మ’ సమంత కళ్ళు మూసుకుని నవ్వులు చిందిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ముగ్గురు కలిసి ‘కోల్గేట్’ టూత్ పేస్టు కంపెనీకి అడ్వర్ టైజ్మెంట్ ఇస్తున్నట్లుగా ఉంది… అంటూ నెటిజన్లు ఇస్తున్న కామెంట్లకు లెక్కేలేదు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్ యాడ్ ‘హహహహహ’ అంటూ వీక్షకుల చేత నవ్వులు పూయించగా, తాజాగా ఈ ముగ్గురు కలిసి అదే ఫీట్ ను రిపీట్ చేయడానికి ప్రయత్నించినట్లుగా కనపడుతోంది.
‘సరైనోడు – భళ్ళాలదేవుడు’ నడుమ కూర్చున్న ‘జెస్సీ’కి అంత నవ్వు తెప్పించిన విషయం ఏమిటో గానీ, చూసేవారిని మాత్రం ముగ్గురు ఆకట్టుకుంటున్నారు. మరో విశేషమేమిటంటే… సమంత పక్కన కూర్చున్న ఇద్దరు హీరోలు గుబురు గడ్డాలతో స్టైలిష్ గా తయారయ్యారు.
Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…
A video shot in an unknown office in Dallas, Texas has gone viral, and has…