Telugu

అల్లు అర్జున్ అతిజాగ్రత్త సుకుమార్ కు సంకటంగా మారింది

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్లాప్ తరువాత బాగా గ్యాప్ తీసుకొని తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ తోనూ. వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమాలకు కమిట్ అయ్యాడు. గతంలో సుకుమార్ మహేష్ బాబు ఒక స్మగ్లింగ్ నేపధ్యంలోని ఒక స్క్రిప్ట్ చెప్పాడు. ఆ సినిమా అధికారికంగా ప్రకటించిన కొన్ని నెలల తరువాత ఆ సినిమాను అటకెక్కించారు.

అదే స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ వద్దకు చేరాడు. మొదట్లో బన్నీ నచ్చిందని చెప్పి సినిమాను అధికారికంగా ప్రకటించారు. స్క్రిప్ట్ మీద సుకుమార్ ఇన్ని నెలలు పని చేసాకా ఇప్పుడు పిలిచి అది పక్కన పెట్టి ఏదైనా లవ్ స్టోరీ సెట్ చెయ్యమని చెప్పాడట అల్లు అర్జున్. దీనితో ఇప్పట్లో ఆ సినిమా సెట్స్ మీదకు ఎక్కే అవకాశం లేదు. ఈలోగా అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేస్తాడు. అంటే రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ కు రెండేళ్లు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

దానితో రంగస్థలం సక్సెస్ ని సుకుమార్ సరిగా మార్కెట్ చేసుకోనట్టే. నా పేరు సూర్య తో బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడటంతో అల్లు అర్జున్ చాలా కసి మీద ఉన్నాడు. ఈ సారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. అల వైకుంఠపురములో, ఆ తరువాత విడుదలై ఈ రెండు సినిమాల విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అయితే అల్లు అర్జున్ అతిజాగ్రత్త సుకుమార్ కు సంకటంగా మారింది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Will Sathyavan Savithri Finally Work For Keerthy Suresh?

Following the back to back failures of Uppu Kappurambu and Revolver Rita, actress Keerthy Suresh…

57 minutes ago

Pics: Divi Vadthya Turns Floral Saree Into Pure Magic!!!

Divi Vadthya is making pastel saree glamour feel fresh, flirty and effortlessly elegant. Dressed in…

1 hour ago