
అయితే సుకుమార్ సినిమా గురించి పెద్దగా వార్తలు రాకపోయినా ఐకాన్ గురించి మాత్రం వారానికి ఒక వార్త బయటకు వస్తుంది. స్టోరీ ఇదని ఆ సినిమాకు రీమేక్ అని, ఆ హీరోయిన్ మెయిన్ హీరోయిన్ అని, ఈ హీరోయిన్ రెండో హీరోయిన్ అంటూ ఏవేవో వార్తలు వచ్చేస్తున్నాయి. నిజానికి హీరోయిన్లు ఎవరు అనేది సినిమా ఎప్పుడు మొదలు అవుతుందనే అనే దాని బట్టి ఉంటుంది. ఎప్పుడో మొదలయ్యే సినిమాకు కాస్టింగ్ గురించి ఇప్పుడే మాట్లాడలేం. సుకుమార్ సినిమా ముందు సెట్స్ మీదకు వెళ్తే మొత్తం మారిపోతుంది.
అయితే కొన్ని మీడియా సంస్థలు ఈలోగా ఏవేవో రాసేస్తున్నాయి. నిర్మాతలు కూడా ఎన్ని వార్తలు వచ్చినా పబ్లిసిటీనే కదా అని పట్టించుకోవడం లేదు. దీనితో మరిన్ని పుకార్లు వచ్చే అవకాశం కలిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నా పేరు సూర్య తో బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడటంతో అల్లు అర్జున్ చాలా కసి మీద ఉన్నాడు. ఈ సారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. చూడాలి వచ్చే సంక్రాంతికి బన్నీ ఏం చెయ్యబోతున్నాడో.
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…