
రెండు వైపుల నుండీ జూనియర్ హీరోలు అల్లు శిరీష్, కళ్యాణ్ రామ్ లు ఒకేరోజు తమ సినిమాలు విడుదల చెయ్యాలనుకున్నారు. కళ్యాణ్ రామ్ 118, అల్లు శిరీష్ ఏబీసిడి ఒకే రోజు (మర్చి 1న) విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా వార్తల ప్రకారం అల్లు శిరీష్ ఏబీసిడి బరిలో నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆ సినిమా మర్చి 22న విడుదల అవుతుందని సమాచారం. వాయిదా పాడటానికి కారణం ఏంటో తెలీదుగానీ ఇది అప్పుడే ఆ సినిమాకు రెండవ వాయిదా. గతంలో ఈ నెల 14న విడుదల చెయ్యాలనుకుని వెనక్కు తగ్గారు.
ఏబీసీడీ’ మలయాళ చిత్రం ‘ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ’ కి ఇది రీమేక్. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్నారు. డి.సురేశ్ బాబు సమర్పణలో యశ్ రంగినేని, ‘మధుర’ శ్రీధర్ నిర్మిస్తున్నారు. మరోవైపు 118 చిత్రాన్ని కెవి గుహన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి హీరోలు ఫామ్ లో లేక ఇబ్బంది పడుతూ ఈ చిత్రాల మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…