
ఆంధ్రప్రదేశ్ లోని సున్నితమైన పరిస్థితుల వల్ల ఈ విషయం బయటకు పొక్కనివ్వడం లేదట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘పింక్’ సినిమాను రీమేక్ చేసేందుకు తెలుగు నేటివిటీకీ తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నివేదా థామస్, అంజలి, అనన్య.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీ ‘పింక్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఈ సినిమాతో థమన్ మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తున్నారు.
ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…