
జూనియర్ సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశి, పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు రాజకీయంగా టీడీపీకి వ్యతిరేకంగా వెళ్లిన సమయంలో వారు పదే పదే జూనియర్ బయటకు రావాలని, దానికి సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేసే వారు. వారు చేసినదానికి జూనియర్ ఎందుకు సమాధానం చెప్పాలని మరి కొందరు వాదించేవారు.
తాజగా బాలయ్య కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. దానికి అంబికా కృష్ణ ముహూర్తం షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంబికా కృష్ణ బాలయ్యకు బాగా సన్నిహితుడు అయితే ఆయన ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉండగా ఆయనను చంద్రబాబు ఏపీఎఫ్డీసీ చైర్మన్ గా కూడా చేశారు.
పదవీ కాలం ముగిశాకా, పార్టీ అధికారం పోయాకా పార్టీ మారిపోయారు. అందరి మాదిరిగానే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. మరి అటువంటి ఆయనతో బాలయ్య సంబంధాలు నెరపడం తప్పే కదా? మరి బాలయ్యకో న్యాయం… జూనియర్ కో న్యాయమా? అంటూ జూనియర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
The last few weeks have been rather dry in terms of fresh options for the…
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అటు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులలో కనిపించే ఆందోళన ఇటు అధికార…