
ఈ ఆరోపణ సంచలనంగా మారింది. ఈ నెల 21 నుండి ప్రారంభం కాబోతున్న షోకి ఇది పెద్ద మచ్చ అయ్యే అవకాశం ఉంది. నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్ట్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఆరోపణ రావడం గమనార్హం. బిగ్ బాస్ 3 షో కోసం దాదాపుగా నలభై మందితో అగ్రీమెంట్స్ చేసుకున్నారట. అందులో 14 మందే ఫైనల్ అవుతారని సమాచారం. ఆ 14 మందిలో పేరు ఉండటం కోసం వాళ్ల బాస్‌ను ‘ఇంప్రెస్’ చెయ్యాలని అడిగినట్టు శ్వేతారెడ్డి ఆరోపించారు. మరి దీనిపై బిగ్ బాస్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో కమల్ హస్సన్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నానిలకు ఇంతకు ముందు టీవీలో చేసిన అనుభవం లేకపోగా… నాగార్జున మాత్రం ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు.
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…
Namit Malhotra’s Ramayana has crossed $517K in US premiere advance sales, but the numbers reveal…