
టబూనే నటింపజెయ్యాలి అని ప్రయత్నించినా అందుకు ఆమె ఒప్పుకోలేదు. చేసిన పాత్రే మళ్ళీ చెయ్యను అని తేల్చి చెప్పింది. ఆ తరువాత శ్రియను అనుకున్నా పని అవ్వలేదు. తాజాగా… ఒరిజినల్లో టబూ, రాధికా ఆప్టే పోషించిన పాత్రలకు తమన్నా, నభా నటేష్ ఎంపికయ్యారని చిత్రబృందం ప్రకటించింది.
‘అంధాధున్’లో టబూ పాత్ర ఎంతో కీలకం… తన నటనతో విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందడంతో పాటు ఫిల్మ్‌ఫేర్ సహా పలు అవార్డులను గెలుచుకున్నారు. అయితే ఆ స్థాయిలో తమన్నా వల్ల కాదని… ఇది మంచి ఛాయస్ కాదని విమర్శలు వస్తున్నాయి. చూడాలి తమన్నా అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తుందేమో!
నితిన్ తన రంగ్ దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా మొదలుపెడతాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 6గా తయారయ్యే ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…