
తాజాగా రైతులను తూలనాడి తనని తాను ఎన్టీఆర్ తో పోల్చుకున్నారు విష్ణు. “అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్ లో తెలుగు జాతి ముద్దుబడ్డ ఎన్టీఆర్ గారిపై చంద్రబాబు జరిపిన దుశ్చర్యకాండా పరంపర నిన్నటి ఏబీఎన్ చర్చా కార్యక్రమం వరకు మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉన్నది. భౌతిక దాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన,” అంటూ పెద్ద డైలాగే వేసేశారు.
“ప్రజల తరఫున ప్రశ్నించడంలో నేను వెనకడుగు వేసేదిలేదు, ఇటువంటి దాడులకు మేము బెదిరేది లేదు. అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతునొక్కడం అసాధ్యం. ప్రజా సమస్యలపై మరింత రెట్టింపుగా ఇకముందూ నా వాణి వినిపిస్తా,” అని కూడా చెప్పుకొచ్చారు. ప్రశ్నించడం, వాణి వినిపించడం అంటే ఏంటో అర్ధం కాలేదు. రైతులను పెయిడ్ ఆర్టిసులంటూ పిలవడం బీజేపీ లైనా? ప్రభుత్వాలను ప్రశ్నించడం మానేసి హక్కుల కోసం పోరాడే రైతులను మాటలు అనడం ఏంటో?
పోనీ ఒక పక్క బీజేపీ అమరావతికి అనుకూలం అంటూ ఇంకో పక్క రైతులను మాటలు అనడం విష్ణు అభిప్రాయమా లేక ఆ పార్టీ అభిప్రాయమా? ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు అందరూ ఖండించాలి అయితే రైతుల పట్ల చులకన భావం.. పరుష పదజాలం వాడి విష్ణు ఆ సానుభూతి లేకుండా చేసుకున్నారు. ఆయనకు వంత పాడి బీజేపీ కూడా అటువంటి పరిస్థితే తెచ్చుకుంటుంది.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…