
అయితే జగన్ మౌనం పై విమర్శలు రావడంతో ఆయన మీడియాకు కొన్ని లీకులు ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏ మాత్రం న్యాయం చేయలేదని, ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని మళ్లీ మళ్లీ కోరాలని.. పార్లమెంట్లోనూ ఇదే విధానంతో ముందుకెళ్లాలని జగన్ నేతలకు సూచించారట. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు కనీసం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించలేని పరిస్థితికి వచ్చామా అని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులే అనుకోవడం విశేషం.
గతంలో చంద్రబాబు కూడా ఇంతే కొన్ని కొన్ని విషయాల్లో మీడియా ముందుకు రాకుండా, లీకులు ఇచ్చే వారు. ప్రజలకు నిజంగానే ముఖ్యమంత్రి పలానా విషయం మీద స్పందించారు అని అనుకునేటట్టు. ఇప్పుడు జగన్ కూడా అదే పంథాలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆయనకు గానీ పార్టీకి గానీ మంచిది కాదు. ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నప్పుడు గతంలో చంద్రబాబు మీద తాము ఎటువంటి విమర్శలు చేశామో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గుర్తు తెచ్చుకుంటే తాము చేస్తుంది రైటో రాంగో తెలుస్తుంది.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…