
గవర్నర్ అంటే రాజ్యాంగపరమైన హోదా. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. ఎక్కడకెళ్లినా ఆయనకు రెడ్కార్పెట్ స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే తనకు అటువంటి ఆడంబరాలు, బ్రిటిష్ కాలంనాటి సంప్రదాయాలు వద్దని, అనవసర ఖర్చులకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటీవల శ్రీశైలం పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ మేరకు చెప్పారు
సాధారణంగా గవర్నర్ ప్రత్యేక విమానం, హెలికాప్టర్లో పర్యటనలకు వెళ్తారు. విమానం దిగినప్పటి నుంచి కారు వద్దకు వెళ్లే వరకు ఎర్రతివాచీ పరిచి అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అయితే అలాంటి పద్ధతులు పాటించాల్సిన పనిలేదని గవర్నర్ చెప్పారు. గతంలో కూడా ఆయన ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్లేందుకు అవకాశమున్నా.. సాధారణ విమానంలోనే వెళ్లారు
అలాగే తనను వివిధ సందర్భాలలో కలిసేందుకు వచ్చేవారు కేవలం మొక్కలు మాత్రమే తెచ్చేలా చూస్తున్నారు. ఆ మొక్కలను రాజ్ భవన్ ప్రాంగణంలో నటిస్తున్నారు. అలాగే కొన్ని ఉద్యోగులకు ఇచ్చి పలు చోట్ల నాటేలా చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆచరణలో చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…
Nitesh Tiwari’s Ramayana is all set to arrive in Diwali 2026. The entire world is…