Telugu

రాజధాని తరలింపుపై సచివాలయం ఉద్యోగుల నిరసన

ఈ నెల 20 నుండి విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ కు ఆంధ్రప్రదేశ్ సచివాలయం మారుతుందని వార్తలు వస్తున్న క్రమంలో సచివాలయ ఉద్యోగులు కూడా బయటకు వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. రాజధాని తరలింపుపై సచివాలయం ముందు పబ్లిక్ పార్క్‌లో ఉద్యోగుల సమావేశమయ్యారు. విశాఖకు సచివాలయం తరలింపు నిర్ణయంపై మండిపడ్డారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో తమ సంఘాల నేతలతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తూ రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ వారికి నచ్చ చెప్పబోయిన అప్స అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పై వారు నిరసన వ్యక్తం చేసారు. నేతల వ్యాఖ్యలతో ఉద్యోగులు అర్ధాంతంరంగా బయటకు వచ్చేశారు.

ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ … రాజధాని మార్పుపై కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతిలో రుణాలు తీసుకుని ఇళ్లు కొనుక్కున్నామని, మరో ప్రభుత్వం వస్తే విశాఖ నుంచి రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని, రాజకీయపార్టీల మధ్య గొడవలకు మమ్మల్ని బలిచేయొద్దని ఉద్యోగులు వేడుకుంటున్నారు.

ఉద్యోగుల అభిప్రాయాన్ని కమిటీలు తెలుసుకోలేదని వారు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నామని, ఇప్పుడు విశాఖ వెళ్లాలంటే ఉద్యోగులకు తిప్పలు తప్పవని ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పోరాటం తప్పదని వారు అంటున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Did Balayya Miss Rajinikanth‘a Trick?

Nandamuri Balakrishna is one of the true blue mass heroes in the senior league of…

11 minutes ago

Aryan Khan: Will He Finally Direct SRK on the Big Screen?

Aryan Khan has started working on the next project from Red Chillies Entertainment. Aryan has…

32 minutes ago