
“తనకు అందం దేవుడిచ్చిన వరమని, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా సమాజంలో మార్పు తెచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని” స్పష్టం చేసారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్న తీరుపై మండిపడ్డ అంగూర్… టెక్నాలజీ పరంగా ఎదిగిన భారత్, మానసికంగా మాత్రం ఎదగలేదని, తనపై చేస్తున్న ఈ ప్రచారం ఆపాలని విన్నవించుకున్నారు.
మార్స్ పై అడుగిడినా, మనుషుల మనస్తత్వాలు మాత్రం మారలేదని, తనను ప్రోత్సహించింది ప్రధాని మోడీయేనని, తనను హాట్ ఎమ్మెల్యే అనవద్దని కోరారు. ప్రజాప్రతినిధిగా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండడంతో, తనకున్న ‘హాట్’ ముద్ర అవరోధంగా మారే అవకాశం స్పష్టంగా ఉండడంతో, దీనికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించిన అంగూర్ మీడియా ముందుకు వచ్చి అందరినీ విజ్ఞప్తి చేసారు.
Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…
A video shot in an unknown office in Dallas, Texas has gone viral, and has…