Telugu

తొందర్లో అన్నా కాంటీన్లు… కానీ 55 మాత్రమే

పేదలకు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్నా కాంటీన్లను జగన్ అధికారంలోకి రాగానే మూసి వేయించారు. ఈ బిల్డింగులు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. బిల్డింగులలో అవినీతికి అందులో భోజనం పెట్టడానికీ లింక్ ఏంటని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ప్రశ్నించేవారు.

అయితే ఆ విషయంలో ప్రభుత్వం తన మాటే నెగ్గించుకుంది. అన్నా కాంటీన్లు మూయించి, ఆ భవనాలను ఇప్పటికే వేరే అవసరాలకు వాడేసుకుంటుంది. పైన ప్రభుత్వం మార్కు కనిపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసుకున్నారు. అయితే రాజన్న కాంటీన్ల పేరుతో ప్రభుత్వం వీటిని తొందరలో మొదలు పెట్టబోతుందట.

ADVERTISEMENT

అయితే అన్నా కాంటీన్ల లాగా పెద్ద స్థాయిలో కాకుండా పరిమితంగా పెట్టబోతున్నారట. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లా, 28 ఏరియా, 11 బోధనాసుపత్రులలో వీటిని ఏర్పాటు చెయ్యబోతున్నారట. అక్కడ కూడా పరిమిత స్థాయిలో రోగులకు, వారి బంధువులకు మాత్రమే అందుబాటులో ఉంటాయట.

పేదలకు తక్కువ ధరకే భోజనం అనేది తమిళనాడులో భారీ స్థాయిలో జరుగుతుంది. తెలంగాణాలో, అటు కర్ణాటకలో కూడా ఈ స్కీం పరిమిత స్థాయిలో అమలు అవుతుంది. అప్పట్లో అన్నా కాంటీన్లలో భోజనం ఆ రాష్ట్రాలకంటే ఎంతో మెరుగ్గా ఉండేది. ఇప్పుడు మొత్తానికి కాలగర్భంలో కలిసిపోయింది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

BB Telugu: Bigg Boss Makes A GOAT Decision

This week's theme on the Bigg Boss Telugu reality show is GOAT. The house is…

18 minutes ago

నామినేషన్స్‌ వేయకుండానే గెలుస్తున్న వైసీపీ!

సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు…

30 minutes ago