
ఈ సినిమాకు ముందు అనుష్క ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లను దక్కించుకున్నాయి. దాంతో ఈ సినిమా కూడా అనుష్కకు సక్సెస్ను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఆమె సన్నిహితులు ఉన్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆర్య మరియు సొనాల్ చౌహాన్లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ సినిమాకు చిత్ర యూనిట్ సభ్యులు భారీ పబ్లిసిటీ చేశారు. దాంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పాటు అయ్యింది. దాంతో తెలుగు మరియు తమిళంలో భారీగా ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా అన్ని రకాలుగా కూడా పాజిటివ్ బజ్తో విడుదల అవ్వబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క నటించడం, తర్వాత కథ, కథనం సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా అన్ని మంచి శకునాలతో ‘సైజ్ జీరో’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
A 23 year old Telugu student, Sreeja Reddy Koya, has been reported missing in Dorchester,…
Ramayana has opened in the theatres worldwide today and the reception for Ranbir Kapoor's portrayal…