
సహజంగా నవంబర్, డిసెంబర్ లలో సినిమాలు ఆడవు. అందుకే నిర్మాతలు ఈ సీజన్ లో సినిమాలు విడుదల చెయ్యరు. ఆ డ్రై సీజన్ ఎఫెక్ట్ పడి అర్జున్ సురవరం తో పాటు విడుదలైన సినిమాలన్నీ దాదాపుగా మొదటి రోజే సర్దేశాయి. అర్జున్ సురవరం పరిస్థితి కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు. టాక్ బావుంది కాబట్టి మిగతా సినిమాల థియేటర్స్ తీసేసి అర్జున్ సురవరంకు యాడ్ చేశారు. అయినా పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు కలెక్షన్స్.
ఈ మధ్య కాలంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. ప్రేక్షకులు సరైన సినిమా కోసం వేచి చూస్తున్నారు. వారిని థియేటర్లకు రప్పించడానికి ఈ టాక్ సరిపోతుందని అనుకున్నా పని అవలేదు. వరుస వాయిదాల వల్ల సినిమా మీద కొంత నిర్లిప్తత అయితే ఉంది. రేపటి నుండి చేసే ప్రమోషన్స్ మీద సినిమా లాంగ్ రన్ ఆధారపడి ఉంటాది
నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రం తమిళ సినిమా కానితన్ రీమేక్. ఆ దర్శకుడు సంతోష్ ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసాడు. ఈ కథ ఫోర్జరీ, దొంగ సర్టిఫికెట్ల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. నిఖిల్ చాలా కాలంగా వేచి చూస్తున్న విజయం ఈ సినిమా తో దక్కుతుందేమో చూడాలి.
Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…