
దీంతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో అశ్వనిదత్ కు ఉన్న మిగతా ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగిపోవడంతో, వైజయంతీ మూవీస్ కి పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. “శక్తి” సినిమాతో పాటు అంతకు ముందు, తర్వాత వైజయంతి బ్యానర్లో వచ్చిన సినిమాలతో భారీగా నష్టపోయిన అశ్వనిదత్ కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజా పరిస్థితుల నేపథ్యంలో వైజయంతి బ్యానర్ తోపాటు, ఆయన కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకదత్ లు నిర్మించే త్రి ఏంజల్స్ బ్యానర్లో లో కూడా పలు సినిమాలు రాబోతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక సినిమాను, రామ్ చరణ్ తో మరో సినిమాను ఇటీవల అశ్వనీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక పై సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని అవకాశాలుగా…
Salman Khan’s Maatrubhumi has been in the headlines over the last few days for a…