గూగుల్‌ ప్లే లిస్ట్‌ టాప్‌లో ‘బాహుబలి’

baahubali towards 500 crores collectionsదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సినిమాలకు అందని కొన్ని అరుదైన రికార్డులను సైతం ‘బాహుబలి’ సాధించింది అని చెప్పవచ్చు. ‘బాహుబలి’ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఆ సినిమాకు భారీ క్రేజ్‌ ఉంది. ఇప్పటికే టీవీలో ప్రసారం అయిన ఈ సినిమాను హాట్‌స్టార్‌తో పాటు ఇంకా పలు మార్గాల్లో ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాను గూగుల్‌ ప్లేలో కూడా భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది.

ప్రస్తుతం గూగుల్‌ ప్లేలో ‘బాహుబలి’ టాప్‌ 5లో స్థానం దక్కించుకుంది. చాప్‌ చార్ట్స్‌లో ప్రస్తుతం అయిదవ స్థానంలో ఉన్న ‘బాహుబలి’ సినిమా హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలకు గట్టి పోటీని ఇస్తోంది. గూగుల్‌ టాప్‌ చార్ట్స్‌లో 1వ స్థానంలో ‘మిషన్‌ ఇంపాస్‌బుల్‌’, 2వ స్థానంలో ‘జురాసిక్‌ వరల్డ్‌’, 3వ స్థానంలో ‘సౌత్‌ప’, 4వ స్థానంలో ‘ప్యూరీ’, 5వ స్థానంలో ‘బాహుబలి’ చిత్రాలు నిలిచాయి. ఇటీవలే ‘బాహుబలి’ చిత్రాన్ని యూట్యూబ్‌లో సైతం విడుదల చేసిన విషయం తెల్సిందే. 4కె టెక్నాలజీతో ఈ సినిమాను యూట్యూబ్‌లో 150 రూపాయలు చెల్లించి చూసే అవకాశాన్ని చిత్ర నిర్మాతలు కల్పించారు. ఇలా అన్ని చోట్ల కూడా ఇంకా ‘బాహుబలి’ హవా కొనసాగుతూనే ఉంది.

Share
Published by

Recent Posts

Big B, SRK, Salman: Today’s Stars Burdening Producers?

Well-known producer KC Bokadia has recently opened up about the good side of some of…

25 minutes ago

Telugu F-1 Student Missing for 36+ Hours

A 23 year old Telugu student, Sreeja Reddy Koya, has been reported missing in Dorchester,…

7 hours ago