Telugu

“అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని” అంటే ఇదేనేమో..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం పరిస్థితి ఇది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యుత్తమమైన క్రీడాకారులు ఉన్నా విజయాలు అందుకోవడంలో బొక్కా బోర్లా పడుతున్న వైనం బెంగుళూరు టీం అభిమానులను కలచి వేస్తోంది. 2016 సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలను అందుకుని 4 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. బెంగుళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగిలిన 8 మ్యాచ్ లలో ఆరు విజయాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిందే.

ADVERTISEMENT

నిజానికి ఈ సీజన్లో బెంగుళూరు ఆడిన తొలి మ్యాచ్ తర్వాత 2016 ఐపీఎల్ ఈ జట్టుదేనని దాదాపుగా అంతా ఖరారైపోయారు. ఓపెనర్ గేల్ మొదలుకొని, విరాట్ కోహ్లి, డివిలియర్స్, వాట్సన్ వంటి హేమాహేమీల భయంకరమైన బ్యాటింగ్ లైనప్ మరే జట్టుకు లేకపోవడంతో బెంగుళూరు టీం ఓటమి పాలు కావడం అసాధ్యం అనుకున్నారంతా. అయితే ఇప్పటివరకు జరిగిన 8 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని బెంగుళూరు జట్టు, ఈ సారి కూడా అదే బాటలో పయనించడం విశేషం.

తాజాగా సన్ రైజర్స్ తో ఆడిన మ్యాచ్ లో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. విరాట్ కోహ్లి 14 పరుగులకే అవుటైనా, మరో ఓపెనర్ రాహుల్ 28 బంతుల్లో 51 పరుగులు చేయగా, చెలరేగిపోతాడనుకున్న డివిలియర్స్ 32 బంతుల్లో 47 పరుగులు చేసాడు. ఇక వాట్సన్ 2 పరుగులకే అవుట్ కావడంతో భారీ లక్ష్యానికి మరో 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్ వార్నర్ 50 బంతుల్లో 92 పరుగులతో వీరవిహారం చేయడంతో భారీ స్కోర్ ను అందుకోగలిగింది. ఈ సిరీస్ లో వరుసగా కెప్టెన్ ఇన్నింగ్స్ లు ఆడుతూ 386 పరుగులతో విరాట్ కోహ్లిని దాటి ‘ఆరంజ్’ క్యాప్ అందుకున్నాడు వార్నర్. ఈ గెలుపుతో ఆడిన 7 మ్యాచ్ లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి టాప్ 4లో స్థానం సంపాదించుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ ను తిలకించడానికి విక్టరీ వెంకటేష్ కొడుకుతో సహా హాజరు కాగా, అక్కినేని అఖిల్ కూడా వెంకీ పక్కనే దర్శనమిచ్చాడు

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Bethlehem Kudumba Unit: Mallu Blockbuster, Telugu Flop?

Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…

26 minutes ago

ట్రంప్‌కి ఇంట్లో ఈగల మోత.. కానీ బయట పల్లకీ మోత లేదే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో…

53 minutes ago