Telugu

పూజా హెగ్డే… జాగ్రత్త పడకపోతే కష్టమే

పూజా హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్. స్టార్ హీరోలందరికీ ఆమె కావాలి. మూడు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజులో మూడు షిఫ్టులలో ఆమె పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో సినిమా చేస్తుండడంతో ఒక్కోసారి స్పెషల్ ఫ్లైట్లలో తిప్పుతున్నారు నిర్మాతలు ఆమెను. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో పూజా ట్రాక్ రికార్డు మాత్రం అంత ఆశాజనకంగా ఏమీ లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటిదాకా ఆమె ఆరు సినిమాలలో నటించింది.

ADVERTISEMENT

ఆరు సినిమాల్లో ఒక్క అరవింద సమేత, డీజే తప్ప ఏ సినిమా కూడా ఆడలేదు. అరవింద సమేత, డీజే సినిమాలు కూడా యావేరేజ్ అనే చెప్పుకోవాలి. దీనితో ఆమెను సినిమా ఫ్యాన్స్ ఐరన్ లెగ్ కిందే చూస్తున్నారు. నిన్న విడుదలైన మహర్షి సినిమా కూడా పెద్దగా ఆశాజనకంగా ఏమీ కనిపించడం. పైపెచ్చు సినిమాలో ఆమె రోల్ అంతంత మాత్రమే. కొందరు సినిమాలో ఆమె ఉన్న స్కీన్లు కట్ చేసేసినా సినిమాకు నష్టం లేదు అంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

దీనితో పూజా తన తదుపరి చిత్రాల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఆమెకు ఇబ్బందే. ఇది ఇలా ఉండగా ఆమె ప్రభాస్ తదుపరి చిత్రంలో నటిస్తుంది. బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు చాలా వరకూ పూర్తి అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రాల ఫలితాలు ఆమె భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

వైఎస్, లోకేష్, పవన్ మారారు.. జగన్‌ మారలేరా?

ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…

7 minutes ago

Paradise OTT Backlash: Mahesh Babu’s Son Adds More Fuel

Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…

37 minutes ago