Telugu

‘సూపర్ స్టార్’ అభిమానులకు చేదు వార్త!

‘సౌతిండియా సెన్సేషన్’ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే ఉత్తరాది ఖాన్ త్రయం కూడా ‘విజిల్స్’ వేసే పరిస్థితి. అలాంటి రజనీ తాజాగా నటిస్తున్న సినిమా ‘కబాలి’ ఆడియో వేడుకలు ఈ నెల 12వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు అధికారిక సమాచారం వెలువడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఇదే అంశంపై చిత్ర నిర్మాతలు అభిమానులకు ఒక చేదు వార్తను అందించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందు వలన, ఆడియో వేడుకను నిర్వహించడం లేదని, జూన్ 12వ తేదీన నేరుగా ఆడియో మార్కెట్ లోకి విడుదల అవుతుందని తెలియజేసారు. వాస్తవానికి ఆడియో రిలీజ్ డేట్ సమయానికి రజనీ వచ్చేస్తారని భావించి, ఆడియో వేడుకను ప్లాన్ చేసామని, అయితే రజనీ లేకుండా వేడుక నిర్వహించడం అసాధ్యం కనుక, ఆడియో ఈవెంట్ కాన్సిల్ అయ్యిందని తెలిపారు.

ADVERTISEMENT

అయితే సినిమా విడుదల మాత్రం, ముందుగా అనుకున్న జూలై 1వ తేదీనే ఉంటుందని తెలుస్తోంది. రజనీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించగా, రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన టీజర్లో సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం శ్రోతలను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా పాటలపై కూడా ‘సూపర్ స్టార్’ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

5 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

5 hours ago