
ఈ రెండు ఇలా ఉంటే… తాజాగా ఉగాది వేడుకలకు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా రెడీ అయ్యారు. బాలయ్య బాబు ప్రతిష్టాత్మక 100వ సినిమా ప్రకటన ఏప్రిల్ 8వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22వ తేదీ నుండి జరగనుంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణ, యోధుడు’ అన్న టైటిల్స్ హల్చల్ చేస్తున్నప్పటికీ, టైటిల్ ప్రకటన కూడా ఏప్రిల్ 8వ తేదీన ఉండే అవకాశముంది.
తాజా వార్తతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఈ ఏడాది ‘డిక్టేటర్’ ద్వారా అభిమానులను ఆకట్టుకున్న బాలకృష్ణ తదుపరి సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్ నిరీక్షణ తీరినట్లయ్యింది. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…