
ఈ చిత్రం కోసం కేథరిన్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనుందని సమాచారం. గతంలో బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన సరైనోడు చిత్రంలో ఆమె ఎమ్మెల్యేగా కనిపించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా వర్తమాన రాజకీయాల గురించి కొంత మేర ఉండడంతో ఆమె పాత్ర కథకు కీలకం కాబోతుందట. చిత్రంలోని మెయిన్ హీరోయిన్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కేరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు.
సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.
Nandamuri Balakrishna is one of the true blue mass heroes in the senior league of…
Aryan Khan has started working on the next project from Red Chillies Entertainment. Aryan has…