బాలకృష్ణ ‘నర్తనశాల’ను ఎప్పుడు మొదలవుతుంది?

స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన అనేక అద్భుతాలలో ‘నర్తనశాల’ చిత్రం ప్రత్యేకమైనది. ఈ సినిమాలో ‘బృహన్నల్’ పాత్రలో నటించిన ఎన్టీఆర్, ఆ పాత్రకు ప్రాణం పోసారు. అందరికీ సాధ్యం కానటువంటి అభినయాన్ని తృణప్రాయంగా చేసి చూపించిన ఆ పాత్రలో మెరవాలనే అభిలాష చాలా సందర్భాలలో బాలకృష్ణ వెలిబుచ్చారు.

అంతేకాదు, ఒకానొక సందర్భంలో ఆ సినిమా రీమేక్ ను ప్రారంభించారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ, ఈ సినిమాకు ఎంపికైన తారాగణం ఒక్కొక్కరుగా వారి వారి వ్యక్తిగత కారణాలతో కనుమరుగయ్యారు. సౌందర్య ఏకంగా ఈ లోకం విడిచి వెళ్ళగా, అంజలా జావేరి, ఉదయ్ కిరణ్ వంటి వారి జీవితాలు అనేక మలుపులు తీసుకున్నాయి. అలాగే ఈ సమయంలో బాలకృష్ణ జీవితంలోనూ కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలా అర్ధంతరంగా ఆగిపోయిన “నర్తనశాల”ను బాలకృష్ణ మరువలేదన్న విషయం మరోసారి స్పష్టమైంది.

“డిక్టేటర్” ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న బాలయ్య, తన డ్రీం రోల్ ప్రస్తావన వచ్చిన సందర్భంలో “నర్తనశాల” సినిమా గురించి మాట్లాడారు. ‘నర్తనశాల’ సినిమాలో నటించాలని చాలా ప్రయత్నాలు చేశాను గానీ కుదర్లేదని, అనుకోకుండా ఆగిపోయిన ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. పౌరాణిక సినిమాల నిర్మాణం పూర్తవ్వాలంటే అన్ని కలిసి రావాలని అభిప్రాయపడ్డారు బాలకృష్ణ.

గతంలో నిత్యామీనన్ పాల్గొన్న ఓ సినీ ఈవెంట్ లో ‘నర్తనశాల’ గురించి ప్రస్తావించిన బాలయ్య… నిత్యామీనన్ ఒప్పుకుంటే “నర్తనశాల” చిత్రాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా అవకాశం, సందర్భం వచ్చినప్పుడల్లా ‘నర్తనశాల’ సినిమాపై తనకెంతో మక్కువ ఉందో నందమూరి నటసింహం చెప్పకనే చెప్తున్నారు. మరి అన్ని భారీ అడ్డంకులు ఏర్పడ్డ ‘నర్తనశాల’ను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ధైర్యం బాలయ్యకు ఉందా? అలాగే గత అనుభవాల దృష్ట్యా ఈ సినిమాలో నటించేందుకు నటీనటులు ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నలెన్నో..!

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

25 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

48 minutes ago