“రామారావు గారు” టైటిల్ తో బాలకృష్ణ సినిమా!

నందమూరి నటసింహం జోరు మీదున్నారు. సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్యా 999’ సినిమాతో పాటు బోయపాటితో ఒక సినిమాకు కమిట్ అయిన బాలకృష్ణ, తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ తో “పటాస్” చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఇటీవల బాలయ్యను కలిసి ఓ స్టోరీ వినిపించారని, ఈ లైన్ బాలయ్యకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని ఈ వార్తల సారాంశం.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ‘సుప్రీం’ సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి, ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు. “పటాస్” సూపర్ సక్సెస్ ఇచ్చినా చాలా సెలక్టివ్ గా సబ్జెక్ట్ లు ఎంచుకుంటున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు “రామారావు గారు” అనే టైటిల్ పెట్టడం మరింత సంచలనంగా మారింది.

ADVERTISEMENT

ఇటీవల నందమూరి కుటుంబంలో జరిగిన పరిణామాల రీత్యా స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆయన పేరుతో సినిమా అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ప్రతి డైలాగ్, సన్నివేశంలో అభిమానులు ఆ పెద్దాయన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. దీంతో టైటిల్ నుండే ప్రారంభమైన “రామారావు గారు” సంచలనాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

Share
Published by

Recent Posts

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

6 minutes ago

బాలయ్య వారసత్వం మోక్షజ్ఞ చేతుల్లో… అసలు పరీక్ష మొదలు

నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…

6 minutes ago