
తాజాగా ఈరోజు హైదరాబాద్లో ఈ సినిమా రీస్టార్ట్ అయ్యింది. ప్రభుత్వం సూచించిన కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇబ్రహీంపట్నం లో ఒక కాలేజీ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ అయిపోయాకా రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతారు. ఆ షెడ్యూల్ లో హీరోయిన్ ప్రగ్య మార్టిన్ కూడా ఎంటర్ అవుతుంది.
డిసెంబర్ మొదటి వారం వరకు ఏకధాటిగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని మరో హీరోయిన్ పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాదిలో దసరాకు విడుదల కావలసిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి గానీ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. వచ్చే ఏడాది మొదట్లో విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత కంపోజర్. ఇంతకుముందు ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని పుకార్లు ఉన్నాయి. బోయపాటికి సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం. అలాగే బాలయ్య కూడా గత ఏడాది వరుసగా మూడు ప్లాపులతో ఫ్యాన్స్ కు భాకీ ఉన్నాడు.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…