‘డిక్టేటర్’ టైటిల్ నా ‘స్వభావం’ : బాలకృష్ణ

నందమూరి నటసింహం నటించిన “డిక్టేటర్” సినిమా ఆడియో ‘అమరావతి’లో అంగరంగ వైభవంగా విడుదలైంది. అశేష అభిమానుల సమక్షంలో థమన్ స్వరపరిచిన గీతాలను గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు రిలీజ్ చేసారు. విచ్చేసిన అతిధులంతా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పగా, సంగీత దర్శకుడు థమన్ “డిక్టేటర్” విడుదల తేదీని జనవరి 14గా ప్రకటించారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహం అమరావతి చరిత్ర, సినిమాలో తన పాత్ర తీరుతెన్నులు గురించి ప్రస్తావించారు.

“మౌర్యులు, కాకతీయులు, గజపతిరాజులు వంటి ఎందరో రాజులు పరిపాలించిన ‘అమరావతి’ నేలపై ఆడియో వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, థమన్ చక్కని బాణీలను అందించారని, దర్శకుడు శ్రీవాస్ తో సినిమా అప్పుడే పూర్తయ్యిందా… అనిపించేలా చేసారని, హీరోయిన్ అంజలి తెలుగు చిత్ర పరిశ్రమకు దేవుడిచ్చిన వరప్రసాదమని, సోనాల్ చౌహాన్ ఇప్పటికే తనతో పనిచేసిందని ఇలా చిత్ర యూనిట్ సభ్యుల గురించి ఒక్కొక్కరిగా చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

ఇక, సినిమాలోని తన పాత్ర గురించి క్లుప్తంగా చెప్తూ… “డిక్టేటర్” అంటే ‘నియంత’ అని అర్ధం… ఈ టైటిల్ నా స్వభావంతో కొంతవరకు కలుస్తుంది… అభిమానులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రం అవుతుంది… సంక్రాంతికే “డిక్టేటర్” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని చిత్ర విడుదలను ధృవీకరించారు. అంటే బాలయ్య బాబు రియల్ లైఫ్ స్వభావం ఏమిటో పరోక్షంగా చెప్పకనే చెప్పారు అంటూ సోషల్ మీడియా సందడి చేస్తోంది. అయితే రియల్ లైఫ్ లో నందమూరి నటసింహం “డిక్టేటర్” అన్న విషయం ఇప్పటికే అభిమానులకు, ప్రజలకు తెలిసిన అంశం. దాన్ని ఇప్పుడు బాలయ్య బాబు అధికారికంగా ధృవీకరించారంతే! కాదంటారా… అభిమానులూ..!

Share
Published by

Recent Posts

Mammootty & Dhanush Bring Pure Dhurandhar Magic to Om

Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…

5 minutes ago

The Paradise: OTT Pressure Changes the Game

Nani’s The Paradise is racing against time to make its September 24 release. After recent…

35 minutes ago