నితిన్‌ హీరోగా మెగా నిర్మాత చిత్రం

పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ వంటి మెగా హీరోలతో సినిమాలను నిర్మించి స్టార్‌ ప్రొడ్యూసర్‌ అనిపించుకున్న బండ్ల గణేష్‌ ‘టెంపర్‌’ చిత్రం తర్వాత మరో సినిమాను మొదలు పెట్టింది లేదు. ఎన్టీఆర్‌ హీరోగా కాజల్‌ హీరోయిన్‌గా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా సక్సెస్‌ అయ్యింది. ఆ సినిమా సక్సెస్‌ అయినా కూడా బండ్ల గణేష్‌ ఎందుకు కొత్త సినిమా ప్రారంభించలేదు అనే చర్చ గత కొంత కాలంగా సినీ వర్గాల్లో జరుగుతోంది. ఇన్నాళ్లకు బండ్ల గణేష్‌ తన తర్వాత సినిమా నిర్మాణంకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది.

ప్రస్తుతం ‘అఆ’ చిత్రంలో హీరోగా నటిస్తున్న నితిన్‌ తన తర్వాత సినిమాను బండ్ల గణేష్‌ నిర్మాణంలో చేసేందుకు ఓకే చెప్పాడు. ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ను ప్రారంభించి, వచ్చే సంవత్సరం ఆరంభంలో నితిన్‌ హీరోగా బండ్ల గణేష్‌ నిర్మాణంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం నితిన్‌ నటిస్తున్న ‘అఆ’ చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల అయ్యేందుకు సిద్దం అవుతోంది.

Share
Published by

Recent Posts

Aniesh’s Itlu Arjuna Unveils Teaser Poster

Aniesh is making his acting debut with Itlu Arjuna, which is scheduled for a theatrical…

5 minutes ago

Romanchakam Created Opportunities: Pranay Reddy Vanga

Presented by director Sandeep Reddy Vanga and directed by debutant Venugopal Reddy, Romanchakam stars Sumanth…

15 minutes ago