
దీంతో ఇప్పుడు సరికొత్త అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ‘భీమ్లా నాయక్’ కి అమెజాన్ ఓ టీ టీ సంస్థ నుండి బిగ్ డీల్ ఉందనే ప్రచారం జరుగుతుంది. డైరెక్ట్ గా OTT రిలీజ్ చేస్తే అధిక మొత్తంలో నిర్మాతకు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని , సుమారు 100 నుండి 150 కోట్ల మధ్య ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారని టాక్ వినబడుతుంది.
కానీ ఇటీవలే ‘రిపబ్లిక్’ ఈవెంట్ లో పవన్ ఇచ్చిన స్పీచ్ చర్చనీయాంశం అయింది. పవన్ రెచ్చిపోవడం వల్లే ఇంకా టికెట్ల సమస్య పై ప్రభుత్వం నుండి క్లారిటీ రావడం లేదనే వాదన కూడా ఇండస్త్రీ నుండి వినబడుతుంది. పైగా థియేటర్స్ అన్నీ తెరిచి సినిమాలు ఆడుతున్న ఈ టైంలో పవన్ సినిమా ఓ టీ టీ రిలీజ్ అయితే గట్టి విమర్శలు రావడం ఖాయం. అభిమానులు కూడా హార్ట్ అయి రచ్చ చేసే అవకాశం ఉంది. పవన్ ఈ సమయంలో తన బాధ్యత గుర్తుపెట్టుకొని ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం పడుతున్నారు.
నిజానికి మేకర్స్ కచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకోరు. కానీ మీడియాలో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అంటూ హడావుడి మొదలైంది. మరి దీనిపై మేకర్స్ త్వరలోనే థియేటర్స్ రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఈ ప్రచారానికి చెక్ పడుతుంది.
Bollywood directors praising Telugu cinema at the pre-release events of their films in the Telugu…
Former IPS officer AB Venkateswara Rao has said that his long-standing relationship with Vangaveeti Radha…