
శివరాత్రి సెలవు కూడా కలిసి వచ్చింది. టాక్ బెటర్ గా ఉండటం… సంక్రాంతి తరువాత సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. దీనితో ఈ వారాంతంలో సినిమా భారీగా రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా మీద 26 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల బట్టి ఇది చాలా ఈజీ టార్గెట్.
సహజంగా ఫిబ్రవరి అనేది ఎగ్జామ్స్ సీజన్ కావడంతో టాలీవుడ్ కి డల్ సీజన్ అంటారు. మొదటి వారాంతం కలెక్షన్స్ తో సినిమా రేంజ్ ని ఒక అంచనా వెయ్యవచ్చు. రేటింగ్స్ కూడా బెటర్ గా ఉండటం యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్దకూడా బాగా రాబట్టే అవకాశం ఉంది. నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి.
ఆ మాటకొస్తే 2016లో వచ్చిన అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో ఈ సినిమాకు వస్తున్న ఆదరణ తో నితిన్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. మరోవైపు పెళ్లికి ముందు నితిన్ చివరి రిలీజ్ ఇదే. హిట్ తో బ్యాచిలర్ లైఫ్ ని ముగించబోతున్నాడు నితిన్. ఇది ఇలా ఉండగా ఈ సినిమాతో రష్మిక వరుసగా రెండో హిట్ కొట్టింది ఈ ఏడాది.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…