
ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందు హీరో నాగ శౌర్య దర్శకుడు వెంకీ కుడుములపై పలు విమర్శలు చేశారు. వెంకీ కుడుముల ఓ నమ్మకద్రోహి అని, అతను తన స్నేహితుడే కాదని నాగశౌర్య అన్నాడు. అలాగే తన అమ్మ బహుమతిగా ఇచ్చిన కారును వాడకుండా పక్కన పడేశాడని చెప్పాడు.
పైగా తాను ఛలో కథ రాశా అని కానీ ఆ సినిమాకు క్రెడిట్ తీసుకోకపోవడం తప్పయింది అన్నాడు. అయితే ఈ విమర్శలపై వెంకీ మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పాడు. “మనస్పర్థలు ఎవరికైనా ఉంటాయి. అయినా మా ఇద్దరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలకు అంత ఆసక్తి ఉండదు. ఆ ఆరోపణల గురించి నేనేం కామెంట్ చెయ్యన`ని వెంకీ కుడుముల చెప్పాడు.
అవన్నీ పక్కన పెడితే… నాగ శౌర్య సొంతంగా కథ రాసిన అశ్వథామ ప్లాప్ కాగా, ఇప్పుడు భీష్మ తో హిట్ ఇచ్చి ఛలో సక్సెస్ క్రెడిట్ పై అనుమానాలను పటాపంచలు చేశాడు వెంకీ. ముందు వివాదంపై స్పందించకుండా ఇప్పుడు ఈ రివెంజ్ ని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు ఈ యువ దర్శకుడు.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…