
దేశసమగ్రత కు భంగం కలిగించి, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించే అటువంటి పోస్టును పదే పదే ప్రసారం చెయ్యడం ఏంటి అంటూ జనసేన అభ్యంతరం తెలుపుతూ టీవీ9కు బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనితో జనసైనికులు ట్విట్టర్ లో #ShamelessTV9 అంటూ ట్రెండ్ చేశారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే సదరు మాధవీ లత గత ఎన్నికలలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడం.
అయితే ఆ ఎన్నికలలో ఆమె ఓడిపోయింది… డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ మధ్య కాలంలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. పవన్ మీద ఆ పార్టీ నేతలు ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇప్పుడు ఈ కారణంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అనేది చూడాలి.
ఎన్నికల తరువాత ఆమె రాజకీయాలలో పెద్దగా యాక్టీవ్ గా లేరు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన ఆమె గతంలో పవన్ కు పెద్ద మద్దతుదారుగా ఉండేవారు. పవన్ ని ఎవరైనా ఏమైనా అంటే పెద్ద ఎత్తున విరుచుకుపడేవారు. ఇప్పుడు ఏమైందో ఏమో తెలీదు.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…