
ఈ నేపథ్యంలో హైదరాబాద్ విచ్చేసిన వెంకయ్యను బీజేపీ తెలంగాణ శాఖ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన వెంకయ్య నాయుడు… తన రాజకీయ సన్యాసంపై నోరు విప్పారు. జాతీయ నాయకుడిగా ఉంటూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదన్న ఉద్దేశంతోనే తాను పరోక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నానని చెప్పి, ఇకపై పరోక్ష ఎన్నికల్లోనూ పాల్గొనేది లేదని తేల్చిచెప్పారు.
ప్రత్యక్ష ఎన్నికలే కాదు… పరోక్ష ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేయను. ఇవే నాకు చివరి ఎన్నికలు. రాజ్యసభ సభ్యుడిగా 18 ఏళ్లు పనిచేసిన నేను… రాజకీయాల నుంచి వైదొలగిన తర్వాత సేవా కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలనుకుంటున్నాను. తోడుగా ఉండి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరడంతో రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు పోటీ చేశా. ఈ దఫా గడువు ముగిసిన తర్వాత మళ్లీ పోటీ చేసే అవకాశం లేదు అని వెంకయ్య వ్యాఖ్యానించారు.
Polling for the MPTC and ZPTC elections in Andhra Pradesh witnessed incidents of clashes and…
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…