
“కొడాలి నాని మాటలు సభ్యసమాజం అసహ్యించుకొంటుంది?ఇంతకన్నా గోరంగా ఆ పార్టీ నాయకులు మీద మాట్లాడగలం కాని సభ్యత అడ్డొస్తుంది!వెంటనే కొడాలి హిందువులకు బీజేపీ అగ్ర నాయకులకు క్షమాపణ చెప్పేలా జగన్ ఆదేశించాలి! లేకపోతే దీనిలో జగన్ గారి,బ్రదర్ అనిల్ పాత్ర ఉన్నట్లుగానే పరిగణిస్తాం??,” అంటూ ఆ పార్టీ నాయకుడు రమేష్ నాయుడు నాగోతు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏదైనా రాజకీయ పార్టీ బ్రదర్ అనిల్ కుమార్ పేరు తేవడం ఇదే మొదటి సారి. బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ మతప్రచారకుడు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దానికి హిందూ… క్రిస్టియన్ యాంగిల్ తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
ఇది ఇలా ఉండగా.. “అహంకారంతో దేవుళ్లను, అత్యంత పవిత్ర హిందువులయిన ప్రధాని మోదీ గారిని, యూపీ సీఎం యోగి గారిని దూషిస్తున్న కొడాలి నాని “కలియుగ” శిశుపాలుడు. వంద సార్లు మోదీ గారిని దూషించే దాకా ఆగి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా తమ పతనాన్ని కోరి తెచుకుంటారో లేక వెంటనే తొలగించి జగన్ గారు తమ తప్పును గుర్తిస్తారో చూడాల్సి వుంది,” అంటూ ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…