
[m9ads]
శుక్రవారం ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
అదే విధంగా ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పిన మాటకు తాము ఏమీ చెయ్యలేము అని కోర్టు తేల్చి చెప్పింది. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు వేసిన ఛార్జ్ షీట్లలో చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదు. బీజేపీయేతర పక్షాలను ఒక తాటిపైకి తీసుకుని వచ్చి మోడీని గద్దె దించుతామని ప్రకటించిన చంద్రబాబును కేంద్రంలోని పెద్దలు టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
A simple run-out chance turned into a costly mistake during the RR vs LSG match…
In a surprising update, S. Thaman has replaced Harshavardhan for the upcoming film starring Venkatesh…