
తమ అభిమాన హీరో ప్రభాస్ ను ‘జబర్దస్త్’ ఫేం చలాకి చంటి ‘బకరా’ అన్నాడనే సమాచారంతో ఓ అభిమాని చంటిని అసభ్య పదజాలంతో తీవ్ర స్థాయిలో దూషించాడు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన చంటి, సదరు యువకుడు గంగుల రాజుపై ఖమ్మం జిల్లా, ఇల్లందులో కేసు నమోదు చేసారు. డీఎస్పీ గారి సమక్షంలో నమోదైన ఈ కేసులో తనకు న్యాయం కావాలని చంటి కోరారు.
అయితే, ఈ విషయంలో తనకు ఏమీ తెలియదని, ఫేస్ బుక్ లో తన ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన సమాచారంతో తానూ కూడా ఒక కామెంట్ చేయాలని చేసినదే గానీ, చలాకి చంటి అసలు ఎక్కడ అన్నారు, ఎప్పుడు అన్నారు వంటి సమాచారం తనకు తెలియదని సదరు యువకుడు ఒప్పుకున్నాడు. అభిమానం పేరుతో హద్దులు దాటితే ఎలా ఉంటుందో ఈ ఉదంతం మరోసారి చాటిచెప్తోంది.
Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…