Telugu

వైఎస్ మృతి వెనుక చంద్రబాబు?

వాతావరణ పరిస్థితులు అనుకూలించక నాడు పావురాలగుట్టపై జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదం కారణంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మృత్యువు వెనుక ఉన్నది ఎవరు? ఎవరూ అదుపులో పెట్టలేనటువంటి ప్రకృతి కబలించిందా? దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటనలు కూడా వచ్చేసాయి. ఇంతలో ఉన్నట్లుండి… జగన్ మీడియా ఆరోపించినట్లు రిలయన్స్ పై ఆరోపణలు గుప్పించి సంచలనం రేపింది… దీంతో నిజంగానే రిలయన్స్ ఇంతటి దారుణానికి ఒడిగట్టిందా? అంటూ అంతా అవాక్కయ్యారు. అయితే దీనికి సమాధానం ఇప్పటికే కోర్టులు చెప్తున్నాయి. దీంతో ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లేదన్న విషయం తేటతెల్లమైంది.

తాజాగా భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఓ సరికొత్త ఆరోపణను వెలుగులోకి తెచ్చారు. నాటి వైఎస్ మరణం వెనుక ప్రస్తుత ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న ఆరోపణలు చేసారు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే… ఈ అనుమానాలు కలుగుతున్నాయని, అంతేకాదు, తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కూడా నిర్మూలించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు భూమన.

ADVERTISEMENT

ఒక్క వైఎస్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఎంతటి రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారో అనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఆరోపణలు నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ‘వైఎస్ మరణ ఉదంతాన్ని’ ప్రస్తావించి ప్రజల్లో సింపతీ పొందడానికి ప్రయత్నించే వారన్న సంగతి రాజకీయ విజ్ఞులకు విదితమే. అలా రాజకీయ మనుగడ సాగిస్తూ వచ్చిన జగన్ మాటలకు ప్రజల నుండి ఆశించిన స్పందన కరువవ్వడంతో అలాంటి మాటలకు దూరంగా జరిగారు.

అదీ కాకుండా రష్యా వెబ్ సైట్ ను ఉదహరిస్తూ రిలయన్స్ పై చేసిన కధనానికి ఇప్పటికీ మూల్యం చెల్లించాల్సి రావడంతో, ఇలాంటి ఆరోపణలతో రాజకీయ ప్రయోజనం లేదన్న విషయం స్పష్టమైంది. అయితే, తాజాగా మరి వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి మళ్ళీ దీన్ని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజల్లో వైఎస్ పై ఉన్న అభిమానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు ఆరోపణలకు తెరలేపాలా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.

అయినా ఒక ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసేటపుడు దానికి తగిన సాక్ష్యాలు ఉండనవరసం లేదా? అలా సక్రమమైన రీతిలో ఆరోపణలు చేయడం వైసీపీ నైజంలో లేని అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వినడానికే హాస్యాస్పదంగా ఉన్న భూమన ఆరోపణలు, అతని రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నాయి మరి! జగన్ పై ఉన్న విధేయతను చూపడానికి అనేక మార్గాలు ఉండగా, భూమన మాత్రం గమ్యం లేని మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనపడుతోంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

6 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

6 hours ago