Telugu

ఇదెక్కడి బయోపిక్ రా బాబు… చంద్రబాబుకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా?

ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితం, రాజకీయ చరిత్ర ఇతివృత్తంతో నిర్మిస్తున్న చిత్రం ‘చంద్రోదయం’ . కథ, మాటలు, దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ. వినోద్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుగా నటించారు. గత సంవత్సరం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. అయితే ఇందులో చంద్రబాబు గెట్ అప్ చాలా కామెడీ గా ఉండటం గమనార్హం. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు కూడా పేలాయి.

ADVERTISEMENT

ఈ చిత్రం విడుదల అయితే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని టీడీపీ అభిమానులు కూడా అనుకుంటున్నారు. అయితే సినిమా తీసిన వాడు ఊరుకుంటాడా? ఈ చిత్రం మార్చి 10న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత జి.వి.కె.రాజేంద్ర తెలిపారు. విశేషం ఏమిటంటే మర్చి 10 ఆదివారం కావడం. అసలు పరీక్షల సీజన్లో సినిమా విడుదల చెయ్యడమే తప్పు. అటువంటిది ఆదివారం రిలీజ్ ఏమిటో? అసలు ఇంత చిన్న నిర్మాత అసలు సినిమాను విడుదల చెయ్యగలడా?

ఒకవేళ చేసినా ఆ పోస్టర్లు చూసి ఎవరైనా సినిమాకు వస్తారా? నాలుగు డబ్బులు కూడా రాకపోతే సోషల్ మీడియాలో జోకులు మళ్ళీ పేలతాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవసరమా ఇటువంటి సాహసం? చంద్రబాబు నిజాయితీగా సమాజానికి చేస్తున్న సేవను ప్రజలకు తెలియజెప్పాలనే లక్ష్యంతోనే ఈ సినిమా తీస్తున్నామని వెంకటరమణ చెప్పారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ‘చంద్రోదయం’ పేరిట రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.

చంద్రబాబు రాజకీయ చరిత్ర కథాంశంగా చంద్రోదయం-1ను మార్చి 10న విడుదల చేస్తామన్నారు. ఆయన జీవిత చరిత్ర కథాంశంగా చంద్రోదయం-2 ఉంటుందన్నారు. మొదటి భాగంలో.. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన పేదల కోసం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూపిస్తామన్నారు. అంటే ముందుది వెనుక వెనుకది ముందు అన్న మాట. బాహుశా అలా చేస్తే ఎన్నికలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారన్నమాట ఆ చిత్రం యూనిట్.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

CSK vs MI: Kerala Star Leaves Hardik’s MI Helpless

Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…

2 hours ago

AA23: Allu Arjun Ensures Lokesh Avoids Coolie Mistake?

Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…

3 hours ago