
తాజాగా ‘నీతి అయోగ్’ చైర్మెన్ అరవింద్ పనగారియా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. “ద్రవ్య లోటు నుండి నిధుల వరకు ఎన్నో కష్టాలతో సతమతమవుతున్నప్పటికీ, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వృద్ధి పధంలో దూసుకెళ్లడానికి ముఖమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర అభివృద్దిని ప్రగతి బాట పట్టిస్తున్న చంద్రబాబు, ఇటీవల చేసిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ఓ గొప్ప కార్యక్రమంగా అభిప్రాయపడ్డారు.
‘డైనమిక్ లీడర్’గా చంద్రబాబు సత్తా గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. అంతటి విశ్వాసంతోనే చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించారు. రాజధాని లేని రాష్ట్రాన్ని, నిధుల కొరతతో సతమతమయ్యే రాష్ట్రాన్ని గట్టేక్కించాలంటే ఒక్క చంద్రబాబు వల్లే అవుతుందని భావించి గద్దేనెక్కించారు. ప్రస్తుతం అభివృద్దికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. ఇక, రాబోయే ఏడాది చంద్రబాబు అసలు ‘విజన్’కు నిదర్శనంలా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలతో పాటు ‘నీతి అయోగ్’ చైర్మెన్ అరవింద్ పనగారియా వంటి వారు కూడా ఏపీలో ఉన్న ఒకే ఒక్క ‘డైనమిక్ లీడర్’ చంద్రబాబు మాత్రమేనని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…